
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరిందని.. ఆ దేశంపై తమ నావికా దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు.
‘‘ప్రపంచంలోని నౌకలు.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి’ అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. అయితే.. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. మరోవైపు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ డీల్ విషయాన్ని ధ్రువీకరించారు. శుక్రవారం నాడు సంతకాలు చేయవచ్చని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.