
లేజర్ సాంకేతికత రాకతో ప్రస్తుతం సర్జరీల తీరు తెన్నులు మారిపోయాయి. చెవి, ముక్కు, గొంతు సమస్యల చికిత్సలో లేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోతలు, కత్తిగాట్లు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద లేకుండా సులువుగా ఆపరేషన్లు జరిగిపోతున్నాయి.
రోగులకు రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం తప్పింది. లేజర్ శస్త్రచికిత్సతో అత్యంత కచ్చితత్వంతో కావాల్సిన మేరకే కణజాలాన్ని వైద్యులు తొలగించగలుగుతున్నారు. దీంతో సర్జరీల సక్సెస్ రేటు పెరిగింది. ఈఎన్టీ సమస్యలు, తల, మెడ క్యాన్సర్ చికిత్సలో లేజర్ల తోడ్పాటు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ వార్త చదివారా: ఒక్క తిత్తుల జబ్బే కాదు మొత్తం శరీర సమస్య