లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రలు పోషించారు.
విజయ్ దేవరకొండ క్యామియో చేయగా.. హీరోయిన్ నివేదా పేతురాజ్ స్పెషల్ రోల్ లో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. జూన్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు.
దీనికి డైరెక్టర్ అనిల్ రావిపూడి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ‘సింగ్ గీతం’ ఈవెంట్ లో నివేదా పేతురాజ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''నేను 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నా. జీవితం మనల్ని తప్పుడు నిర్ణయాల వైపు, తప్పుడు మార్గాల వైపు నడిపిస్తుందని ఆ తర్వాత నాకు అర్థమైంది.
ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారి గోల్డెన్ బ్లాక్ బస్టర్ తో మళ్లీ ల్యాండ్ అయ్యా. నాకు తిరిగి ప్రాణం పోసిన నాగ్ అశ్విన్ కి థ్యాంక్స్. ఒకవేళ నాగి నాకు ఈ అవకాశం ఇవ్వకపోయుంటే, నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఎక్కడో హిమాలయాల్లో మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని.
నేను డిఫరెంట్ లైఫ్ కోరుకున్నాను. కానీ ఒక గొప్ప సినిమాతో నేను మళ్లీ తొరిగొచ్చానని నమ్ముతున్నాను''''నేను నిన్న సినిమా చూశాను. నిజంగా నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా ఆకట్టుకునేలా చూపించారు.
ఈ సినిమా నుంచి ఏదైనా చిన్నపాటి సందేశం తీసుకెళ్లొచ్చని నేను ఆశిస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినందుకు అనిల్ రావిపూడికి థ్యాంక్స్. వచ్చే సంక్రాంతికి ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నా. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.
మ్యూజికల్ ఈవెంట్స్ కి వెళ్ళా. ఇండియాలో కూడా అలాంటి మ్యూజికల్ కాన్సర్ట్స్ జరగాలని కోరుకునే నేను.. ఇప్పుడు ‘సింగ్ గీతం’లాంటి మ్యూజికల్ సినిమాలో భాగం కావడం నేను నమ్మలేకపోతున్నా. సింగీతం గారు డైరెక్టర్స్ డైరెక్టర్ అంతే. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన వైజయంతి మూవీస్‌కు ధన్యవాదాలు'' అని నివేదా అన్నారు. నివేదా పేతురాజ్ ‘మెంటల్ మదిలో’, 'చిత్రలహరి', ‘బ్రోచేవారెవరురా’, 'అలవైకుంఠపురములో', 'రెడ్', 'పాగల్' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2023లో 'దాస్ కా ధమ్కీ' తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అప్పుడే తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేసుకున్నారు. నిశ్చితార్థం రద్దు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న నివేదా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ‘సింగ్ గీతం’ సినిమాతో అలరించారు.చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మెగా 158' సినిమాలో నివేదా పేతురాజ్ భాగమయ్యారు. ఇటీవల తమిళనాడు పొలాచ్చి షెడ్యూల్ లో పాల్గొన్నారు. అలానే వెకంటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోందని, స్పెషల్ సాంగ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో సినిమాకు దూరమైన నివేదా.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.
లండన్ లో ఎన్నో