
ఇంటర్నెట్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) సింగపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. సీఎం అందరినీ పలకరించి వారితో ఫొటోలు దిగారు.
పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు (వరల్డ్ సిటీస్ సమిట్)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, పలువురు మంత్రులు, రాజధాని అమరావతి రెండో దశకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్న సుర్బానా-జురాంగ్ ప్రతినిధులతోనూ సీఎం సమావేశం కానున్నారు.
సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.