
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం ఎయిర్‌బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా, మంటలు చెలరేగడంతో కూలిపోయింది (IAF Jet Crash). ఈ ఘటనలో వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు.
తీవ్రంగా గాయపడిన కో-పైలట్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏఎన్-32 జెట్ దృఢమైన, రెండు ఇంజన్లు గల టర్బోప్రాప్.
ఈ సైనిక రవాణా విమానాన్ని తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. ఇది ఎత్తైన ప్రదేశాలలోని ఎయిర్‌ఫీల్డ్‌లలో, వేడి ఉష్ణమండల వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తుంది. 7.5 టన్నుల సరకును, 50 మంది ప్రయాణికులను, 42 మంది పారాట్రూపర్లను రవాణా చేయగలదు.
ప్రకృతి విపత్తుల సమయంలో మారుమూల ప్రాంతాలలో సామగ్రిని జారవిడవడానికి ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.