
Sigma Movie Release Date: తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘సిగ్మా’ (Sigma) విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన వివరాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. “సిగ్మా జూలై 31న థియేటర్లలోకి వస్తోంది. ఈ అద్భుతమైన సెల్యులాయిడ్ ప్రయాణాన్ని వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ ఒక క్రేజీ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ప్రకటనతో విజయ్ అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ సరికొత్త ఉత్సాహం నెలకొంది. Read Also: Pooja Hegde Selfie Controversy: సెల్ఫీ వివాదంపై స్పందించిన పూజా హెగ్డే ఈ సినిమాకు ఉన్న మరో పెద్ద విశేషం ఏమిటంటే.. ఇందులో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో మెరవనుంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ సమాచారం. కేవలం 25 ఏళ్ల వయసున్న జేసన్ సంజయ్.. కెనడా, లండన్లలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసిన తర్వాతే దర్శకత్వం వైపు అడుగులు వేశారు. 2023 ఆగస్టులో ప్రకటించిన ఈ సినిమా
షూటింగ్‌ను ఆయన పక్కా ప్లానింగ్‌తో కేవలం 65 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. సుభాస్కరన్ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ముఖ్యమంత్రి విజయ్ కుమారుడి తొలి సినిమా కావడం, సందీప్ కిషన్ హీరోగా చేస్తుండటంతో ఈ క్రాస్-వుడ్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Weather Report in Telangana : తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nitin Meets Tdp MLA: టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన హీరో నితిన్
Ram Charan – Shivanna: పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్..ఫోటో వైరల్
Peddi Ticket Prices : పెద్ది ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంపు!
Peddi cinima Pre-release: విజయవాడలో జూన్ 1న పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
Peddi Ticket : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Kara Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘కర’ సినిమా
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. కొన్ని జిల్లాల్లో భానుడి భగభగలు...
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశాల...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘తెలంగాణ...
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం “పెద్ది” విడుదలకు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు...
ఈ ఏడాది ఐపీఎల్ (IPL) సీజన్లో సరికొత్త సంచలనం, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో...
నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ...
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మరోసారి అత్యంత...
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెన్త్ (SSC), ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.