
WATS: వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) ఆధ్వర్యంలో ‘బిగ్ బ్యాక్యార్డ్ 5K‘ (BBY5K) రన్/వాక్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రెడ్మండ్లోని మేరీమూర్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరామ్ , ఇతర
సభ్యులు పాల్గొన్నారు.
ఉద్దేశ్యం.. BBY5K అనేది కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొనదగ్గ 5K పరుగు , నడక కార్యక్రమం. స్థానిక పార్కులు , వినోద కార్యక్రమాలకు (recreation programs) మద్దతు ఇవ్వడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంవత్సరం కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.