
Air India Crash గతేడాది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వందలాది కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చిన AI-171 అత్యంత ఘోర విమాన ప్రమాదంతో వందలాది
Jun 12 2026 2:36 PM | Updated on Jun 12 2026 2:49 PM
Air India Crash గతేడాది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వందలాది కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చిన AI-171 అత్యంత ఘోర విమాన ప్రమాదంతో వందలాది మంది జీవితాలు తలకిందలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకే ఒక్కడు'విశ్వాస్ కుమార్ రమేష్' సజీవంగా బతికి బయటపడినప్పటికీ, ఒక్కొక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. అలాంటి వారిలో తన తండ్రిని, సోదరిని ఎప్పటికీ చూడలేని ఒక పసిబాలుడు ఒకడు
బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోతుందని, అది తన జీవితంలో అంతులేని అగాథాన్ని మిగులుస్తుందని మొబ్బషెరా వహోరా అస్సలు ఊహించి ఉండరు. అప్పటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయివారిలో మొబషెరా భర్త పర్వేజ్ వహోరా, నాలుగేళ్ల కుమార్తె జువేరియా కూడా ఉన్నారు. ఇండియాలోని కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చి, తిరిగి లండన్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తండ్రీకూతుళ్లు ఇద్దరూ చనిపోయిన ఘటనతో ఇరు కుటుంబాలు ఆ షాక్ నుండి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి.
మరోవైపు అప్పటికే గర్భవతిగా ఉన్న లండన్‌లో ఉన్న జువేరియా తల్లి మొబషీరా, ఈ ఊహించని గుండె కోతను తట్టుకోలేకపోయారు. లండన్‌లో భర్త, బిడ్డ తిరిగిన ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయింది. వారి జ్ఞాపకాలను, కడుపులో బిడ్డను మోస్తూ ఆమె మహారాష్ట్రలోని తారాపూర్‌లో ఉన్న తన స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. అంతటి తీవ్రమైన బాధలోనూ ఆమె గర్భాన్ని మోస్తూ భారతదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారి రాక ఒక మధుర క్షణమే అయినా, అదొక చేదు నిజాన్ని కూడా గుర్తు చేస్తోంది.
సర్వస్వం కోల్పోయి, ఒంటరిదైపోయిన తమ సోదరిని తిరిగి స్వదేశానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నామని ఆమెబంధువు షారూఖ్ గుర్తు చేసుకున్నారు. తమ జీవితాలకు బాబు జననం ఆశాకిరణమే అయినప్పటికీ, ఏ పాపం తెలియని పసివాడు తన తండ్రిని, చెల్లిని చూడలేడనే నిజాన్ని నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంతటి ఘోర విషాదానికి ఏడాది పూర్తయినప్పటికీ, 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు, విమానంలో ఉన్న ప్రయాణికుల కుటుంబాలలో దాదాపు 96 శాతం మందికి తాత్కాలిక పరిహారం చెల్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఈ ప్రమాదానికి గల కారణాలేంటో తెలియదు. ఇంకా న్యాయం కోసం వేచి చూస్తున్నాయి.
ఇదీ చదవండి : 90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్సీపీ సమర శంఖం (ఫొటోలు)
కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)
‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)
నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు
రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!
ఆ రోజు సూర్యుడు మాయం, శతాబ్దంలోనే అతిపెద్ద వింత!