
కవిత (Kavitha) రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణసేన ( టీఆర్ఎస్) పై బీఆర్ఎస్ (BRS) అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ (Telangana) సెంటిమెంట్‌తో
ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించవద్దని ఈసీఐని కోరింది. ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తారని పేర్కొంది. ఆ పేరు ఎవరికీ కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ (TRS) పేరుపై ఈసీఐకి దాదాపు 700 అభ్యంతరాలు అందాయి. కవిత పార్టీపై అభ్యంతరాలు చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంగం గతంలో సూచించిన సంగతి తెలిసిందే.