
ఇంటర్నెట్‌డెస్క్: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఓ మోడల్ అడ్డంగా దొరికిపోయింది. తన అనుమానాస్పద ప్రవర్తనతో అధికారులకు చిక్కి.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జైలు పాలైంది. ముంబయి విమానాశ్రయంలో ఈ ఘటన
చోటుచేసుకుంది (Drug Smuggling).
కేరళకు చెందిన 28ఏళ్ల హర్ష సన్నీ (Harsha Sunny) బ్యాంకాక్ నుంచి ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె ట్రాలీబ్యాగ్‌ను తనిఖీ చేయగా.. 12 ప్లాస్టిక్ ప్యాకెట్స్ బయటపడ్డాయి. అందులోని పదార్థమంతా ఆకుపచ్చరంగులో ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌లోనే నార్కో పరీక్షలు నిర్వహించారు. ఆ పదార్థాన్ని గంజాయిగా గుర్తించారు. ప్యాకెట్ల బరువు 11 కేజీలు ఉండగా.. ఆ డ్రగ్ విలువ దాదాపు రూ.11.82 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
నిషేధిత మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కింద ఆమెను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆ మోడల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఇక, ఆ సరకును దేశంలోని ఏ ప్రాంతానికి తరలించడానికి ఆమె తీసుకువచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హర్ష సన్నీ 2025లో జరిగిన మిసెస్ కేరళ పోటీదారు కావడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.