బిగ్ బాస్ 10 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుందని ఇటీవలే ప్రకటించారు. బిగ్ బాస్ 10కి సంబంధించిన ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా అగ్ని పరీక్షను నిర్వహించనున్నారు. ఈ
మేరకు అప్డేట్ ఇచ్చారు. జూన్ 12 నుంచి జూన్ 20 వరకు ఆడిషన్స్ క్లిప్స్ పంపించాలని తెలిపారు. ఇక అగ్ని పరీక్ష నుంచి వచ్చే కంటెస్టెంట్లు అద్భుతంగా క్రియేట్ చేయొచ్చని కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ నిరూపించిన సంగతి తెలిసిందే. అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లకు, సెలెబ్రిటీలకు మధ్య గత సీజన్లో జరిగిన పోరు అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యులు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాలనే కోరికతో ఉంటాడు. అందుకే గత సీజన్లలోనూ కామన్ మెన్ కేటగిరీ ఉండేది. అయితే 9వ సీజన్ నుంచి ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్‌ను తీసుకు వచ్చారు. సామాన్యులు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశాన్ని బిగ్ బాస్ టీం ఇస్తోంది. గత సీజన్లలో దాదాపు 20 మందిని తీసుకుంటే.. చివరకు ఇంట్లోకి ఐదారు మంది వెళ్లారు. ఇక వారిలో చివరి వరకు నిలబడిన పవన్, కళ్యాణ్ పడాల ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే.ఈ పదో సీజన్‌కు సంబంధించిన అగ్ని పరీక్ష ప్రక్రియ కూడా షురూ అవుతోందని తెలిపారు. ఈ మేరకు ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. లైఫ్‌లో అద్భుతాలు సాధించాలంటే సామాన్యులకు కొన్ని సార్లే అవకాశం వస్తుంది.. ఇప్పుడు అలాంటి అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చింది.. అదే బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2.. అని నాగ్ చెప్పిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లైన్స్ జూన్ 12 నుంచి జూన్ 20 వరకు ఓపెన్లోనే ఉంటాయని, అంత వరకు సామాన్యులు తమ తమ ఎంట్రీలను నమోదు చేసుకోవచ్చని, ఆడిషన్స్ క్లిప్స్‌ను పంపించొచ్చుని తెలిపారు.అసలే ఈ పదో సీజన్లో కంటెస్టెంట్ల పేర్లు ఓ రేంజ్లో వినిపిస్తున్నాయి. కుకు విత్ జాతిరత్నాలు షోలో సందడి చేస్తున్న నిఖిల్, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, పల్లవి రామిశెట్టి, హరి ఇలా అందరూ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెడతారని సమాచారం. ఇక వీరితో పాటు మరి కొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చివరి వరకు ఈ లిస్ట్‌లోకి ఎవరెవరు వస్తారో చూడాలి.