
ట్రై-సిరీస్‌లో భాగంగా ఇవాళ శ్రీలంకలోని దంబుల్లా స్టేడియం వేదికగా జరుగిన వన్డే మ్యాచ్‌లో భారత్ ఏపై ఆఫ్ఘనిస్తాన్ ఏ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఎ జట్టు నిర్ణీత 49
ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 84 పరుగులు చేశగా. కెప్టెన్ తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ చెరో హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును ముందు తీసుకెళ్లారు. ఇక తొలిసారి ఇండియన్ టీమ్‌లో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 22 బంతుల్లో 44 పరుగులు చేసి అఫ్ఘాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
ఇక లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఆఫ్ఘానిస్తాన్ ఎ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో అఫ్ఘాన్ ఏ ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లకు కుదించింది. 294 పరుగుల టార్గెట్‌ను ఫిక్స్ చేశారు. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ 25.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇక మళ్లీ వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆఫ్ఘానిస్తాన్ 4 పరుగులు తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆఫ్ఘన్ కెప్టెన్ ఇమ్రాన్ మీర్, బాహిర్ షా అజేయ చెరో ఆఫ్ సెంచరీతో తమ జట్టును విజయంలో కీలక పాత్ర పోషించారు.
మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.