
అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’లో కలకలం రేగింది. ప్రమాదకర పదార్థాలున్నట్లు అలారం మోగడంతో అందులోని పలు అంతస్తులను లాక్డౌన్ చేశారు.. మరి కొన్నింటిలో సిబ్బందిని ఖాళీ చేయించారు. అక్కడ
అత్యవసర నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రత్యేక సహాయక బృందాలు కూడా మోహరించాయి. పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ మాట్లాడుతూ గాలి నాణ్యతకు సంబంధించిన ఒక సమస్యను ఇక్కడి వ్యవస్థలు గుర్తించాయని.. దాని తీవ్రతను నిర్ధరించే వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెంటగాన్‌లో లాక్డౌన్.. ఏం జరిగిందంటే? |