
పర్యావరణ పరిరక్షణ అనేది ఓ పెద్ద ట్రెండ్‌గా మారకముందే, ముంబైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ 'ది ఆర్కిడ్' ఆ దిశగా వినూత్న చర్యలు చేపట్టింది. హోటల్ గదుల నుంచి రిఫ్రిజిరేటర్లను తొలగించడం, 'జీరో-గార్బేజ్'
(శూన్య వ్యర్థాలు) విధానాన్ని అమలు చేయడం వంటి కార్యక్రమాలతో ఆతిథ్య రంగంలో సుస్థిరతకు మార్గదర్శిగా నిలుస్తోంది.కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్‌లో భాగమైన ఈ హోటల్, ఏళ్ల తరబడి పర్యావరణ హితమైన విధానాలను పాటిస్తోంది. గదుల్లో ఫ్రిజ్‌లను ఎందుకు తొలగించారో ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వరుణ్ సహానీ వివరించారు. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. అనవసరమైన విలాసాల కంటే నాణ్యమైన ఏసీ, శుభ్రమైన గదులు, నిరంతరాయ వైఫై, మెరుగైన సేవలందించడమే అసలైన విలాసమని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదట్లో అతిథులు గదుల్లో మినీ-బార్లు లేకపోవడాన్ని గమనించినా, ఇప్పుడు ఫిర్యాదులు దాదాపుగా తగ్గిపోయాయని ఆయన అన్నారు.ఈ హోటల్ 'జీరో-గార్బేజ్' విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఇక్కడ వెలువడే సేంద్రియ వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారాన్ని హోటల్ ప్రాంగణంలోనే ఉన్న వర్మీకంపోస్టింగ్ కేంద్రంలో ఎరువుగా మారుస్తున్నారు. దానిని హోటల్ గార్డెన్లకు వాడుతున్నారు. సిబ్బంది పనిచేసే ఫలహారశాలలో చెత్తబుట్టలు లేకుండా చేయడం ద్వారా ఆహార వృథాను పూర్తిగా అరికడుతున్నారు. నీటిని ఆదా చేసేందుకు షవర్లు, ట్యాప్‌లకు ఏరేటర్లు బిగించారు. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా గాజు సీసాలను వినియోగిస్తున్నారు.ఈ పర్యావరణ హిత విధానాలు యువ ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కామత్ హోటల్స్ గ్రూప్ వ్యాప్తంగా 28 ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుతోందని, మరో 16 వాహనాలను సమకూర్చుకోనుందని