
అమరావతి: మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మెరిట్ లిస్టులన్నీ ఇప్పటికీ వెబ్సైట్లో ఉన్నాయని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన
మాట్లాడారు.
‘‘హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అర్థం చేసుకోలేక విమర్శలు చేస్తున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన అందరికీ ఉద్యోగాలు రావని నోటిఫికేషన్లోనే చెప్పాం. ఏకాంబరం అనే వ్యక్తికి 125 ర్యాంకు వచ్చింది.. అతను బీసీ ‘డి’ కేటగిరీకి చెందిన వ్యక్తి. ఆ కేటగిరీలో 110 ర్యాంకుల వరకూ ఉద్యోగాలు వచ్చాయి. ఆన్లైన్ విధానంలో అంతా పారదర్శకంగా ఉంటుంది. రిజక్షన్ లిస్టు అంటూ ఏదీ పెట్టలేదు’’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విజయవాడలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయంగా మారాయి.
రేషన్ కార్డు కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఒక్కరోజులోనే పరిష్కారం చూపారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.