రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 7
రోజుల్లో రూ.345 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే పెద్ది సినిమాకి నెగిటివిటీ చాలా ఎక్కువ అయిందని, యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకున్నారని నటుడు జగపతి బాబు అన్నారు.పెద్ది సినిమాలో అప్పలసూరి అనే పాత్రలో జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బుచ్చిబాబుతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘పెద్ది’ అనేది అప్పలసూరి కథ అని, సినిమాలో హీరో తర్వాత ఆ పాత్రే మెయిన్ అని బుచ్చిబాబు అన్నారు. అప్పలసూరి పాత్ర చాలా సింపతీగా ఉండాలని, కానీ జగపతిబాబు అంటే రాయల్ గా కనిపిస్తారని.. అందుకే ఆ క్యారెక్టర్ ఎంపిక విషయంలో మొదట్లో స్ట్రగుల్ అయ్యానని, చివరకు AIలో స్టోరీ బోర్డు చూసాక ఆ పాత్రకు జగపతి సరిగ్గా సరిపోతాయని అనిపించిందని బుచ్చిబాబు తెలిపారు.* ‘పెద్ది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ‘దేవర’ రికార్డును బ్రేక్ చేస్తుందా?ఆస్కార్, RRR లాంటి అచీవ్ మెంట్స్ ఉన్న రామ్ చరణ్.. ‘పెద్ది’ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారని, మనిషి చేసే పని చేయలేదని, ప్రాణం పెట్టేసాడని జగపతిబాబు ప్రశంసించారు. ‘రంగస్థలం’ సినిమా టైంలో రామ్ చరణ్ ఫస్ట్ టైం యాక్ట్ చేసాడని స్టేజ్ మీదే అన్నానని, తన మాటలకు చిరంజీవి ఫీల్ అయ్యారని జగపతి బాబు చెప్పారు. పెద్ది సినిమాలో నటనకు గాను చరణ్ కు నేషనల్ అవార్డ్ రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ట్రైలర్ విషయంలో పొరపాటు జరిగిందని, ఇది సినిమాపై ట్రోలింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిందని జగపతి బాబు అభిప్రాయ పడ్డారు. ‘పెద్ది’ ట్రైలర్ దగ్గరే బుచ్చిబాబు అందరికీ మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చేశాడని, ఫస్ట్ షోకే మోసేయొచ్చని ట్రోలర్స్ ప్రిపేర్ అయ్యారన్నారు జగపతిబాబు. అభిమానులు మాత్రం భుజం మీద ఎత్తుకుని తిరిగారన్నారు. ఇలాంటి సినిమాలకు అలాంటి పొరపాట్లు జరగకూడదని ఆయన పేర్కొన్నారు. 300 - 400 కోట్ల రూపాయలతో మూడేళ్లు కష్టపడి ఒక సినిమా తీస్తే, రూ.300 టికెట్ కొని సినిమా చూసి ట్రోల్ చేసేవాడు దానికి పది ఇరవై రెట్లు సంపాదించుకోలడని, అటువంటి ఇండస్ట్రీలో ఉన్నామని అన్నారు. మూడు వందల టికెట్ కొని సినిమా చేసేవాడని కింగ్ అని జగపతిబాబు పేర్కొన్నారు.సినిమా గెలిచిన తర్వాత కూడా మళ్లీ పోరాడాల్సి వస్తోందని, ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు అలా ఉన్నాయని జగపతి బాబు విశ్లేషించారు. “అపోజిషన్, నెగెటివ్ పీపుల్ తో ఈ పోరాటం జరుగుతోంది. నా ఆలోచన ప్రకారం, మొదటి మూడు రోజులు పక్కా ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు. ప్రతీ హీరో సినిమాకి అది మామూలే. అది తప్పదు. కానీ పెద్ది మూవీకి అది చాలా ఎక్కువైంది. ఈ చిత్రానికి నెగెటివిటీ చాలా ఎక్కువ. కావాలని చేసేవాళ్లు గ్యారంటీగా ఉన్నారని ఇవాళ అర్థమైంది. బిగినింగ్ లో నా అంచనాలకు తగ్గట్టు సినిమా వెళ్లలేదని నేను డిజప్పాయింట్ అయ్యాను”* హిందీలో రామ్ చరణ్‌కు ఎదురు దెబ్బ.. ‘పెద్ది’కి షాకింగ్ కలెక్షన్స్!“రివ్యూలు, రియాక్షన్స్ రోజు రోజుకూ పాజిటివ్ గా మారుతూ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసి చాలా బాగుందని చెప్తున్నారు. అంత బాగున్న సినిమాని బాగాలేదని ఎందుకు అంటున్నారని అంటున్నారు. ఇలా నిజమైన ఆడియన్స్ థియేటర్లకు అవడానికి టైమ్ పడుతోంది. ఫస్ట్ డే రామ్ చరణ్ అభిమానులతో పాటుగా యాంటీ ఫ్యాన్స్ కూడా వస్తారు. 90% ఇండస్ట్రీ వాళ్లు, బయటివాళ్లు, సినిమా పోవాలని కోరుకునేవాళ్లు వస్తారు. కొందరు నెగిటివ్ మైండ్ తో, మరికొందరు ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తారు. మన విజువలైజేషన్ వేరు.. అక్కడ విజువల్ వేరు. ఇలాంటి సినిమాలకు ఆ రెండిటినీ మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. పెద్ది.. హీరో 50 మందిని కొడితే విజిల్స్, క్లాప్స్ పడే కమర్షియల్ సినిమా కాదు. ఇది ఫీల్ అయ్యే సినిమా. ఆ ఫీలింగ్ బయటకు రావడానికి మూడు రోజులు టైమ్ పట్టింది” అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.