
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Makutam Teaser:‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ చిత్రాల విజయాల తర్వాత విశాల్ చేస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఎందుకంటే ఈ చిత్రానికి ఆయనే హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఆ సంస్థకు 99వ ప్రాజెక్ట్ కావడం విశేషం.
టీజర్లో విశాల్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన లుక్, స్టైల్ ఉండటం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా వయసు మళ్లిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరో రెండు పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది.
ఈ సినిమాలో అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. టీజర్లో ఆమె యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంతకుముందు చూడని విధంగా ఆమె పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. దుషార విజయన్ పాత్రకు సంబంధించిన కొన్ని షాట్లు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సినిమాకు రవి అరసు కథ అందించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. టీజర్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్రభావవంతంగా ఉంది. రిచర్డ్ ఎం నాథన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే ‘మకుటం’ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ మేకింగ్, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా మంచి ట్రీట్‌గా ఉండనుందని టీజర్ సూచిస్తోంది. ‘మకుటం’ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.