తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం వీరిద్దరి మధ్య ఈ ప్రత్యేక భేటీ జరిగింది
. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంతో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాలు పెంపు, ఉపాధి కల్పన, ఆరోగ్యం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.