
రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి
చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా, జూన్11, (ఆంధ్రజ్యోతి): రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) హుస్నాబాద్ బస్టాండ్‌ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాలు గురించి అడిగి మంత్రి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా ఇంజినీరింగ్ కాలేజీ, టూరిజం, మెడికల్ కాలేజీ ఇండస్ట్రీయల్ కారిడార్ ద్వారా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ప్రయాణికుల సంఖ్య.. బస్టాండ్ రెవెన్యూ పరంగా ముందుందని తెలిపారు. ప్రతిరోజూ 35 వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్తుంటారని చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ బస్టాండ్‌ని పెద్ద షాపింగ్ మాల్గా అభివృద్ధి చేస్తామని.. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News