
నర్సింహులపేట, జూన్ 11 : గత కొన్ని రోజులుగా ఉపాధి పనులు కల్పించకపోవడంపై మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కూలీలు ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా
చేశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఉపాధి పనులు కల్పించకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఇబ్బంది పెడుతున్నాడని, పనులకు సంబంధించి పలుమార్లు అడిగిన ఎలాంటి సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.
గతంలో 6 రోజులు పని చేస్తే నాలుగు రోజులు మాత్రమే మస్టర్లు హాజరు వేసి రెండు రోజుల కూలి కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు అవసరమైన పనులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సూపండెంట్ కు వినతి పత్రాన్ని అందించారు.