
Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఈ మూవీ రిలీజ్
అయిన ఏడు రోజుల్లో 345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్రం బృందం సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం మరో రెండు లేదా మూడు రోజుల్లో 400 కోట్ల క్లబ్లో చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Mirnaa : చూపులతో మత్తెక్కిస్తున్న మిర్నా మీనన్.. క్యూట్ ఫోటోలు వైరల్.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో జాన్వీకపూర్ కథానాయిక. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు నిర్మించారు. BOX OFFICE CHAMPION 💥💥#Peddi collects a gross of over 345 CRORES WORLDWIDE in 7 days ❤🔥#PEDDI Now In Cinemas 💥 — PEDDI (@PeddiMovieOffl) June 11, 2026