
Nandamuri Balakrishna Birthday: టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆయన ఒక వైపు తన జన్మదిన వేడుకలను
జరుపుకుంటూనే, మరోవైపు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హస్పిటల్‌కు సంబంధించిన 25 సంవత్సరాల (సిల్వర్ జూబ్లీ) మైలురాయి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ.. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న చిన్నారుల సమక్షంలో తన పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఆపై ఆ చిన్నారి రోగులకు స్వయంగా కేక్ తినిపించి, వారికి ప్రత్యేక బహుమతులు అందజేసి వారిలో ధైర్యాన్ని నింపారు.
Read Also : NBK111 Movie Updates: NBK111 గ్లింప్స్.. బాలయ్య కొత్త అవతార్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రస్థానాన్ని, నాడు-నేడు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. “బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించి విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 1989లో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఆనాడు ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల నిర్మాణ పనులు ఆలస్యమై.. 10 సంవత్సరాల తర్వాత అంటే 2000వ సంవత్సరంలో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది” అని బాలకృష్ణ వివరించారు.
కేవలం 40 పడకల చిన్న ఆసుపత్రిగా మొదలైన బసవతారకం, నేడు రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ 715 పడకల భారీ ఆసుపత్రిగా రూపాంతరం చెందిందని బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. “ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతోమంది రాత్రింబవళ్లు కృషి చేశారు. వారి అంకితభావం, శ్రమ ఫలితమే ఈరోజు మన భారతదేశంలోనే మొదటి ఐదు బెస్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ ఆసుపత్రుల జాబితాలో బసవతారకం స్థానం సంపాదించుకుంది. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలతో పాటుగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఇక సినీ, రాజకీయ రంగాల్లో దశాబ్దాలుగా అదే ఉత్సాహంతో దూసుకుపోతున్న బాలకృష్ణ తన ఫిట్నెస్ మరియు ఎనర్జీపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని, ఎప్పటికీ ప్రజాసేవలో, సినిమాల్లో ప్రేక్షకులను అలరించడంలో తన జోష్ ఇలాగే కొనసాగుతుందని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు పలువురు నందమూరి అభిమానులు పాల్గొని బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Stock market: బుధవారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Revanth Reddy: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Vangalapudi Anitha: జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో హోంమంత్రి అనిత విమర్శలు
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
CBN : ప్రభుత్వ సేవల కోసం ఆన్లైన్లో మరో యాప్ – చంద్రబాబు
Kancherla Srinivasulu murder case: కంచర్ల శ్రీనివాసులు హత్య కేసులో 13 మందికి యావజ్జీవ జైలు శిక్ష
Cancer drug prices: పెరిగిన కీమోథెరపీ మందుల ధరలు
Vegetable prices: తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు