
ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి భాష మీకు అర్థం కావట్లేదా? మీటింగ్‌లో బాస్ మాట్లాడే భాషతో ఇబ్బంది పడుతున్నారా? దీనికి చెక్ పెట్టేందుకే గూగుల్ సిద్ధమైంది. మరో సరికొత్త ఏఐ ఫీచర్‌తో
ముందుకొచ్చింది. జెమినై 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ స్పీచ్-టు-స్పీచ్ ట్రాన్సలేషన్ మోడల్‌ను తీసుకొచ్చింది (Gemini 3 5 Live Translate). అవతలి వ్యక్తి మాట్లాడే భాషను సెకన్లలోనే మనకు కావాల్సిన భాషలోకి సహజంగా ఏఐ వాయిస్ అనువాదం చేస్తుంది. దీంతో ఆఫీస్ మీటింగ్‌లు, లైవ్ బ్రాడ్కాస్ట్ వంటి సమయాల్లో భాషాపరమైన ఇబ్బందులు తప్పనున్నాయి.
ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ట్రాన్స్‌లేట్, గూగుల్ మీట్, గూగుల్ ఏఐ స్టూడియో, గూగుల్ లైవ్ ఏపీఐలో రోల్అవుట్ చేసింది. ఏఐ వాయిస్‌లకు సింథ్ఐడీ వాటర్ మార్కింగ్ కూడా జోడించింది. ప్రస్తుతం 70కి పైగా భాషల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.