
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న 'ఎన్బీకే 111' సినిమా గ్లింప్స్ బాలయ్య పుట్టినరోజున విడుదలైంది. ఈ గ్లింప్స్ లో బాలకృష్ణ కొత్త లుక్, పవర్ఫుల్ నటన ఆకట్టుకుంటున్నాయి
‘వీరసింహారెడ్డి’ మూవీతో హిట్ కాంబినేషన్‌గా నిలిచారు అగ్ర హీరో బాలకృష్ణ (Balakrishna)- డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇదే కాంబోలో మరో సినిమా తెరకెక్కుతోంది. ‘ఎన్బీకే 111’ (NBK 111) వర్కింగ్ టైటిల్. బాలయ్య పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా గ్లింప్స్ విడుదలైంది. బాలకృష్ణను దర్శకుడు ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా, కొత్త లుక్‌లో చూపించనున్నట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎప్పటిలాగే తమన్ మ్యూజిక్‌తో అదరగొట్టారు. ఈ వీడియో చూశారా: ‘నా దృష్టిలో వయసు నంబర్ మాత్రమే: బాలకృష్ణ