
చెన్నై(ఆర్కేనగర్): దివంగత నటుడు జెమినీ గణేషన్ మనవరాలు డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈమె చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రి డైరెక్టర్
, గైనకాలజిస్ట్. 7 నెలల్లో 8వేల మీటర్ల ఎత్తైన రెండు శిఖరాలను అధిరోహించిన 50ఏళ్లకు పైబడిన తొలి భారతీయ మహిళగా ఘనత సాధించారు. చెన్నైలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం కష్టమైన లక్ష్యమైనా దృఢ సంకల్పం, ఆధ్యాత్మిక నిబద్ధతతో సాధించానన్నారు. 2021 నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించాలనే ఆలోచన మొదలైందన్నారు. అందుకోసం నాలుగేళ్లు శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ఇల్లు, ఆస్పత్రి మెట్లు ఎక్కడం, వంతెనలు ఎక్కడం మాత్రమే తన శిక్షణలో భాగమన్నారు.
ఎవరెస్ట్‌ను రోజూ 12, 13 గంటల పాటు అధిరోహించానని, 8 రోజుల్లో చేరుకుని రికార్డు సృష్టించానని ప్రియా సెల్వరాజ్ పేర్కొన్నారు. కిందకు దిగేటప్పుడు అదుపుతప్పి కిందపడగా వెంటనే రోప్ వేసుకోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. తిరిగొచ్చే దారిలో నేపాల్ రాజధాని ఖాఠ్మాండూ చేరుకున్నప్పుడు ఆరోగ్యంలో మార్పులు గమనించానన్నారు. ఎవరెస్ట్ కంటే ముందు 8,163 మీటర్ల ఎత్తున్న మానస్లు శిఖరాన్ని అధిరోహించానని చెప్పారు. కుటుంబ సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పారు. నేటితరం ఇళ్లకే పరిమితమై సెల్ఫోన్లలో మునిగిపోయారని వ్యాయామం చేసి శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరికొద్ది రోజుల్లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీ దగ్గరపడుతున్న కొద్దీ కేరళలోని సాకర్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది.