
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ‘సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (CGGPOA)’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌కు సీఎం చంద్రబాబు
(Chandrababu) కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికిని బలోపేతం చేయడానికి, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచి పౌరులకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ కీలక నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా.. పాలన సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి ఆకాంక్షలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తుందన్నారు. ఏపీలో ప్రపంచస్థాయి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు ఇది నిదర్శనమని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సీఎం చంద్రబాబు ఓ మహిళకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు వెళ్లిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సఫలీకృతులయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రశంసించారు.