
సీఎం చంద్రబాబు ఓ మహిళకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పు తీర్చి ఆమె కుటుంబంలో వెలుగులు నింపారు. ఏలూరు జిల్లా గోపీనాథపట్నం గ్రామానికి చెందిన
నాగలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత డిసెంబర్లో పింఛన్ ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లిన సీఎం.. కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. తన పరిస్థితిని సీఎంకు ఆమె వివరించారు. చలించిన సీఎం ఆదుకుంటామని నాగలక్ష్మికి హామీ ఇచ్చారు. ఈ మేరకు హామీ నెరవేర్చారు. దీంతో ఆ కుటుంబసభ్యులు సంతోషంతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదీ చదవండి: కుట్రలు తప్ప జగన్కు అభివృద్ధి పట్టదు: మంత్రి కొల్లు రవీంద్ర