
PM Modi | దిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ (PM Narendra Modi) కువైట్ పాలకులకు ఫోన్ చేశారు. కువైట్ (Kuwait) యువరాజు (అమీర్) షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్
జబీర్ అల్ సబాతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ దేశంపై ఇరాన్ చేసిన దాడులను ఖండించారు. అక్కడి భారతీయుల క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం దౌత్య పరిష్కారాలు కనుగొనాలని మోదీ పిలుపునిచ్చారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని.. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల కువైట్, బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై టెహ్రాన్ చేసిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. మార్చిలోనూ కువైట్‌లోని ఓ విద్యుత్ నీటి శుద్ధి కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదీ చదవండి: పీవోకేలో ఘర్షణలు.. 30 మందికి పైగా మృతి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.