
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) మాజీ నేత, ఫాల్తా (Falta) నియోజకవర్గ అభ్యర్థి జహంగీర్ ఖాన్ (Jahangir Khan) నాటకీయ పరిణామాల మధ్య
ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఎన్నికల అవకతవకలు, ఈవీఎం ట్యాంపరింగ్ కేసుల్లో గత నెల రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (STF) అధికారులు భారత్-నేపాల్ సరిహద్దుల్లో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Read also:Delhi airport accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. మూడు ఎయిర్ ఇండియా విమానాలు ధ్వంసం!
టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా, ఫాల్తా పరిసరాల్లో బలమైన నేతగా జహంగీర్ ఖాన్‌కు పేరుంది. అయితే ఈ ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రత్యేక అబ్జర్వర్‌గా వచ్చిన యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి, ‘సింగం’ ఇమేజ్ ఉన్న అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగడంతో కథ అడ్డం తిరిగింది. అజయ్ పాల్ శర్మ నేరుగా జహంగీర్ అడ్డాకే వెళ్లి హెచ్చరికలు జారీ చేయడంతో.. టాలీవుడ్ హిట్ సినిమా క్యారెక్టర్‌ను గుర్తు చేస్తూ తనను తాను స్థానిక ‘పుష్ప’గా జహంగీర్ అభివర్ణించుకున్నారు. “నువ్వు సింగం అయితే నేను పుష్ప.. తగ్గేదే లే” అంటూ అప్పట్లో పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్ విసిరి నెట్టింట వైరల్ అయ్యారు.
బెంగాల్లో 15 ఏళ్ల టీఎంసీ పాలన ముగిసి.. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జహంగీర్‌పై ఐదుకు పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు ఆయన కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. ముందస్తు మధ్యంతర రక్షణ పొడిగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు ఆదేశాలు వచ్చిన కొద్దిసేపటికే అలర్ట్ అయిన బెంగాల్ ఎస్టీఎఫ్, దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్న జహంగీర్ ఖాన్‌ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో పక్కా ప్లాన్‌తో పట్టుకుంది.
ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన రెండో విడత పోలింగ్‌లో ఈవీఎంలలో బీజేపీ ఓటింగ్ బటన్‌పై టేప్ అంటించారనే ఆరోపణలపై మే 21న ఎన్నికల సంఘం పునఃపోలింగ్కు ఆదేశించింది. అయితే ఈలోపే బెంగాల్లో సరికొత్త పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చారంటూ.. మే 19వ తేదీనే జహంగీర్ ఖాన్ అకస్మాత్తుగా పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో టీఎంసీ అధిష్ఠానం ఆయన్ను దూరం పెట్టింది. జహంగీర్ తప్పుకున్న తర్వాత జరిగిన ఫాల్తా పునఃపోలింగ్ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా ఒక లక్షకు పైగా ఓట్ల రికార్డు మెజారిటీతో సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మీపై ఘనవిజయం సాధించారు. పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్‌కు కేవలం 8,000 లోపు ఓట్లు మాత్రమే పోలై నాలుగో స్థానానికి పడిపోయారు.
Farooqnagar sarpanch association: ఉపసర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఎమ్మెల్యే శంకర్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Delhi airport accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. మూడు ఎయిర్ ఇండియా విమానాలు ధ్వంసం!
Bengaluru Crime : ప్రియుడి మోజులో కన్న కూతుర్నే హత్య చేసిన తల్లి కేసులో సంచలన విషయాలు
Norway Chess Champion: గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు రూ.50 లక్షల బహుమతి అందించిన సీఎం విజయ్!
Alliance of India : కొనసాగుతున్న ఇండియా కూటమి సమావేశం
INDIA Alliance Meeting Delhi:ఇండియా’ కూటమి భేటీలో సీఎం విజయ్‌కు నో ఎంట్రీ.. ఢిల్లీ వేదికగా ఊహించని ట్విస్ట్!
Indian-American : లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిత్యా రామన్ ముందంజ