
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వస్తున్న కొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్ పతాకంపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ఇది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన
పాత్రధారులుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 11న (singeetam movie 2026) విడుదల కానుంది. ‘ఇది ఓ గ్రామంలోని ప్రజలకు ఎదురైన వింత సమస్య చుట్టూ తిరిగే కథ. కొన్ని అనూహ్యమైన పరిణామాల తర్వాత ఆ ఊరి వాసుల సాధారణ మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్థుల గందరగోళాన్ని.. తమ వింత పరిస్థితికి సమాధానం వెతికే ప్రయత్నాల్ని ఇందులో వినోదాత్మకంగా ఆవిష్కరించారు’ అని చిత్ర బృందం తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘భారత్ భాగ్య విధాత’. బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘సాధారణ వ్యక్తుల అసాధారణ గాథ. భయం కంటే మానవత్వమే గొప్పదని చాటిచెప్పే ఓ రాత్రి కథ. భారతదేశపు నిజమైన వీరుల అప్రకటిత గాథ’ అని చిత్ర బృందం తెలిపింది. జూన్ 12న (Bharat Bhhagya Viddhaata (2026) విడుదల కానున్న ఈ మూవీలో కంగనా నర్స్ పాత్రలో కనిపించనున్నారు.
బావామరదళ్ల మధ్య ప్రేమ పుట్టిందంటే ఇక పెళ్లి జరగడమే ఆలస్యం అనుకుంటారంతా! కానీ, ఆ జంట ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మరింతకీ పెళ్లి జరిగిందో, లేదో తెలియాలంటే ‘కొత్త మలుపు’ చూడాల్సిందే. ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. భైరవి అర్ధ్యా కథానాయిక. శివవరప్రసాద్ కేశనకుర్తి దర్శకుడు. తథాస్తు క్రియేషన్స్ పతాకంపై తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ పంపిణీ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల (kotha malupu movie release date) ముందుకు తీసుకొస్తోంది.
వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint (2026). సంజీవ్ మేగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇది ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది’’ అని చిత్ర బృందం తెలిపింది.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.