
ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లను యుద్ధభయాలు కమ్మాయి. దాంతో సోమవారం సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). సెన్సెక్స్ 800 పాయింట్ల మేర కుంగింది. ఉదయం 9.33 గంటల సమయంలో
సెన్సెక్స్ 675 పాయింట్లు కోల్పోయి, 73,567 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 23,150 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.35గా ఉంది. నిఫ్టీ సూచీలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, ఎంఅండ్ఎం, హిందాల్కో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇరాన్ (Iran) - ఇజ్రాయెల్ (Israel) మధ్య ఏప్రిల్ 8 తర్వాత మరోసారి తీవ్రస్థాయి ఘర్షణలు మొదలయ్యాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ఇలాంటి సమయంలో దాడులు వద్దని ట్రంప్ చెప్తున్నా.. ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఈ ఘర్షణలతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక బ్యారెల్ ధర మూడు శాతం మేర పెరిగి.. 96 డాలర్ల పైనే ఉంది. ఈ పరిణామాలు నష్టాలకు కారణమవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.