
ఇంటర్నెట్ డెస్క్: సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్ జంటగా నటించిన సినిమా ‘రమణి కల్యాణం’ (Ramani Kalyanam). ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ‘సన్నెక్స్ట్’ (SUN NXT)లో జూన్ 12 (Ramani Kalyanam
Release Date) నుంచి స్ట్రీమింగ్ కానుంది. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందేే.
ఈ సినిమా కథేంటంటే?: ఓ ప్రమాదంలో బాల్యంలోనే కంటిచూపు కోల్పోతుంది సంజన (దీప్షిక). అయినా నిరుత్సాహపడకుండా.. పబ్‌లో సింగర్‌గా, మరోవైపు ఆర్జేగా పని చేస్తుంటుంది. ఎప్పుడూ గతాన్ని తలచుకుంటూ బాధపడే రాజ్ (సూర్య వశిష్ఠ) ఆమెకు అనుకోకుండా పరిచయం అవుతాడు. కాళ్లు కోల్పోయి వీల్ ఛైర్‌కే పరిమితమైన కుర్రాడు రాజ్. ఇద్దరి మధ్య స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. సంజన స్ఫూర్తితో రాజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. మరి, రాజ్ లక్ష్యమేంటి? దాన్ని చేరుకున్నాడా, లేదా? తన కాళ్లు పోవడానికి కారణమేంటి? రాజ్- సంజనల కల్యాణం జరిగిందా? అన్నది చిత్ర కథ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.