అప్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 పరుగులు
చేసింది. జట్టు స్కోరు 564 వద్దకు చేరుకోగానే.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు చేయగా.. సాయి సుదర్శన్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు కొట్టారు. అఫ్ఘాన్ బౌలర్లలో మహమ్మద్ సలీమ్ సఫీ అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు.ఓవర్ నైట్ స్కోరు 368/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. చాలా సేపటి వరకు వికెట్ ఇవ్వలేదు. సెంచరీ, హాఫ్ సెంచరీతో రెండో రోజు ఆట ప్రారంభించిన గిల్, పంత్ అఫ్ఘాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. 177 బంతుల్లో 126 రన్స్ చేసిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ (19) భారీ స్కోరు చేయలేకపోయాడు.అయితే ఫామ్ కొనసాగిస్తూ పంత్.. సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ 121 బంతుల్లో 81 రన్స్ చేసిన తర్వాత అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. ఐపీఎల్ ఫామ్ కొనసాగించాడు. 68 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. మానవ్ సుతార్ (28), మహమ్మద్ సిరాజ్ (22) రాణించారు. జట్టు స్కోరు 8 వికెట్ల నష్టానికి 564 పరుగులకు చేరిన తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అప్ఘాన్ బౌలర్లలో 127 ఓవర్లు వేశారు. ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్.. 12 బంతుల్లోనే 22 పరుగులు రాబట్టాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అంటే కేవలం బౌండరీల ద్వారానే అతడు ఈ ఇన్నింగ్స్‌లో తన మొత్తం రన్స్ స్కోరు చేశాడు.అప్ఘానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ సలీమ్ సఫీ అత్యధికంగా ఆరు వికెట్లు తీసి, సత్తాచాటాడు. రెహ్మాన్ షరీఫ్, హష్మతుల్లా షాహిదీ ఒక్కో వికెట్ తీశారు.