
అఫ్గానిస్థాన్తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది
.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 368/3తో రెండో రోజు ఆటను టీమిండియా ఆటను ప్రారంభించింది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(14*), మానవ్ సుతార్(9*) ఉన్నారు. తొలి రోజు భారీ ఆధిక్యంతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. కాస్త తడబడింది. తొలి సెషన్లోనే వరుస ఓవర్లలోనే రిషభ్ పంత్(81), ధ్రువ్ జురెల్(19) పెవిలియన్ చేరారు.
దూకుడుగా ఆడుతున్న పంత్.. త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అంతకుముందు గిల్ 126 పరుగులు చేసి ఔటయ్యాడు. సలీమ్ సాఫి 4, రెహమాన్ షరీఫీ 1, హష్మతుల్లా షాహిది 1 వికెట్ పడగొట్టారు.
అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ ఎంపికపై బీసీసీఐ స్పందనిదే..
కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..