
ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా ఆకట్టుకుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి
Jun 5 2026 7:50 PM | Updated on Jun 5 2026 7:55 PM
ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా ఆకట్టుకుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ మూవీ హిట్ తర్వాత వైష్ణవ్‌కు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ పెద్దగా రాణించలేకపోయాయి.
దీంతో సక్సెస్ కోసం మెగా హీరో తంటాలు పడుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్‌లను మెగా హీరో తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కానీ ఇటీవలే ఓ కథకు వైష్ణవ్ ఓకే చెప్పారని లేటేస్ట్ టాలీవుడ్ టాక్. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో హంట్ మూవీ డైరెక్టర్ మహేశ్‌తో వైష్ణవ్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు వైష్ణవ్ ఓకే చెప్పారట. మహేశ్ చెప్పిన కథ వైష్ణవ్‌కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు