
అమరావతి: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు పవన్ రాజకీయ
అమరావతి: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. ‘‘లింగమనేని రమేశ్‌కు 2015 నుంచి జనసేనతో అనుబంధం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే పవన్ ఆలోచనలకు ఆయన ఆకర్షితులయ్యారు. శనివారం మధ్యాహ్నం రమేశ్ నామినేషన్ వేస్తారు’’అని హరిప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు తెదేపా, ఒకటి జనసేన తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు.