బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం 'ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్'ను స్థాపించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని ఆమె తండ్రి, లెజెండరీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె
బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం 'ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్'ను స్థాపించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని ఆమె తండ్రి, లెజెండరీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె వెల్లడించాడు. తన డిప్రెషన్ గురించి దీపిక బహిరంగంగా వెల్లడించిన కొద్ది నెలలకే చోటుచేసుకున్న ఓ స్నేహితురాలి మరణం ఆమెను తీవ్రంగా కలిచివేసిందని, ఆ విషాద ఘటనే ఫౌండేషన్ ఏర్పాటుకు బలమైన సంకల్పంగా మారిందని ఆయన పేర్కొన్నాడు.ఇటీవల 'ది సమ్థింగ్ బిగ్గర్ షో'లో పాల్గొన్న ప్రకాశ్ పదుకొణె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. "2015లో దీపిక తన మానసిక సమస్యల గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు మేము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తన అనుభవాలు ఇతరులకు మేలు చేస్తాయని ఆమె బలంగా నమ్మింది" అని ఆయన గుర్తుచేసుకున్నాడు.ఆ తదనంతరం జరిగిన ఒక విషాద ఘటన దీపిక ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందని ప్రకాశ్ వివరించాడు . "కొన్ని నెలల వ్యవధిలోనే తన స్నేహితుల్లో ఒకరు తనువు చాలించడంతో దీపిక తీవ్రంగా చలించిపోయింది. ఆ సమయంలో కేవలం తన కథను చెప్పడమే కాకుండా, మానసిక ఆరోగ్యంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తించింది. అలా ఫౌండేషన్ ఆలోచన కార్యరూపం దాల్చింది" అని ఆయన తెలిపాడు. ఈ విషయంపై దీపిక తమతో చర్చించినప్పుడు, కుటుంబ సభ్యులుగా తాము పూర్తి మద్దతు అందించామని ఆయన పేర్కొన్నాడు.మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు నిపుణులను సంప్రదించడానికి ఎంతమాత్రం సంకోచించకూడదని, భయాందోళనలకు లోనుకావొద్దని ప్రకాశ్ పదుకొణె ఈ సందర్భంగా