
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi Movie) ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi Movie) ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ మేరకు జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి అల్లరి పనులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు బాగా సిస్టర్స్ కంటే బాగా అల్లరి చేసేవాడినని, అమ్మను కూడా బాగా ఇబ్బంది పెట్టే కొడుకునని చరణ్ నవ్వుతూ ఒప్పుకున్నారు. ‘‘ఒకసారి అమ్మ వచ్చి.. రామ్, భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరికీ అబద్ధాలు చెప్పకు’’ అని మందలించగా.. ‘ఎందుకు మమ్మీ?’ అని ప్రశ్నించానని, ‘‘ఎందుకంటే నువ్వు సరిగ్గా అబద్ధం చెప్పలేవు, దొరికిపోతావు’’ అని సరదాగా అన్నట్లు గుర్తుచేసుకున్నారు.
ఇక స్కూల్ బంక్ కొట్టడం, ఇంకా చిన్న చిన్న అబద్ధాల నుంచి మొదలైన తన అల్లరి, ఆ తర్వాత మరింత శృతిమించిందని రామ్ చరణ్ తెలిపారు. తను, తన స్నేహితుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి రాత్రిపూట ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళడానికి ఒక ప్లాన్ వేసేవారట. తమ బెడ్రూమ్ కిటికీ గ్రిల్స్ యొక్క స్క్రూలను ఊడదీసి, రాత్రి వేళల్లో కిటికీ గుండా బయటకు దూకేసేవారట. బయట ఫ్రెండ్స్‌తో కలిసి కార్ డ్రైవింగ్‌లు, ఐస్‌క్రీమ్‌లు తింటూ నైట్ అవుట్స్ చేసి, తెల్లవారేసరికి మళ్ళీ గుట్టుచప్పుడు కాకుండా లోపలికి వచ్చి ఆ గ్రిల్స్‌ని యథావిధిగా బిగించేసేవారట.
అయితే, ఒకరోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ కిటికీ గ్రిల్స్‌ని పూర్తిగా మేకులతో కొట్టేసి సీల్ చేయడాన్ని చూసి షాక్ అయ్యామని చరణ్ చెప్పారు. వారు చేస్తున్న ఈ దొంగచాటు నైట్ అవుట్ ప్లాన్‌ను కనిపెట్టడానికి వాళ్ళ ఇంట్లో వారికి రెండు మూడు నెలల సమయం పట్టిందట. ఈ విషయాలన్నీ మెగాస్టార్ చిరంజీవికి తెలుసా అని యాంకర్ అడగగా.. ‘‘తెలియదు.. మా అమ్మ ఎందుకో నాన్నకు ఈ విషయాలేవీ తెలియకుండా దాచిపెట్టింది’’ అని చరణ్ అనగానే.. ‘ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూశాక ఆయనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా’ అని జాన్వీ కపూర్ కూడా చరణ్‌ని ఆటపట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా! చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!