
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
116 Years old woman from Karnataka climb alipiri steps: తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా చెప్తారు. ఈ క్రమంలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు తిరుమలకు కాలినడకన అలిపిరి, శ్రీవారి మెట్ల గుండా తిరుమలకు చేరుకుంటారు. మరికొంత మంది.. ప్రైవేటు వాహనాల్లో తిరుమల కొండకు వస్తారు. శ్రీవారి దర్శనం కోసం ఎన్నిగంటలైన క్యూలైన్ లలో భక్తులు వేచి చూస్తుంటారు. ఒక్కసారి శ్రీవారిని కళ్లారా చూసేందుకు పరితపిస్తారు. గోవిందా.. గోవిందా.. అంటూ కాలినకడన మార్గంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొంటు కొండను ఎక్కుతారు.
ఈ క్రమంలో తిరుమలలో 116 ఏళ్ల బామ్మ అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామిని దర్శించుకొవడానికి వచ్చింది. బామ్మను చూసి ఆమార్గంలో వెళ్తున్న భక్తులు పులకించిపోతున్నారు. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు శ్రీనివాసునిపై భక్తితో, కుటుంబ సభ్యుల సహాయంతో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
బామ్మ కుటుంబం అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారు. బామ్మ అంత పెద్ద వయసులో కూడా అచంచలమైన భక్తి విశ్వాసాలతో మెట్లు ఎక్కుతుంటే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. భక్తి అనేది ప్రధానమని.. అలాంటి గొప్పవారికి వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించాదని అక్కడి వారు బామ్మ భక్తికి ఫిదా అవుతున్నారు.
శ్రీనివాసుడ్ని దర్శించుకొవాలనే సంకల్పం అందరికి స్పూర్తీ దాయకం అంటూ అక్కడి వారు కొనియాడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం బామ్మ భక్తికి చేతులెత్తి దండం పెడుతున్నారు. మరోవైపు తిరుమలలో రద్దీ కొనసాగుతుంది.
Read more: తిరుమలలో రికార్డు బద్దలు.. జూన్ నెలలో ఏకంగా ఎన్ని కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయో తెలుసా?
శిలాతోరణం వరకు క్యూలైన్ లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని వేచి ఉన్న కం పార్ట్ మెంట్లు 23 క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12-15 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10-15 గంటలు, రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 1.2 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.