
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
EVV Banner New Movie Starts: ఆర్యన్ రాజేష్ .. హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అడపదడపా కొన్ని చిత్రాల్లో కనిస్తున్నాడు. తాజాగా ఈయన తన తండ్రి దివంగత ఇవివి సత్యనారాయణ స్థాపించిన ఇవివి బ్యానర్ పై ఇకపై వరుస చిత్రాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా సరికొత్త కాన్సెప్ట్‌తో కొత్త సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఈవీవీ సినిమా ప్రొడక్షన్ నెం.10, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.1: హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నూతన చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.
పూజా కార్యక్రమాలతో ఇవివి బ్యానర్ పై కొత్త చిత్రం ప్రారంభం..
తెలుగు సినిమా రంగంలో ఐకానిక్, పేరెన్నికగన్న నిర్మాణ సంస్థల్లో ఈవీవీ సినిమాకు కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’, ‘తొట్టి గ్యాంగ్’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ’, ‘ఫిట్టింగ్ మాస్టర్’, నువ్వంటే నాకిష్టం, కితకితలు వంటి వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు ఈ లెజండరీ బ్యానర్‌పై ఈవీవీ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా మారాడు. తాజాగా ఈయన మరో నిర్మాత ఎన్.వి.కృష్ణారెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మంచబోతున్నారు.
రియల్ లైప్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమాను ఉండబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో హర్ష్ రోషన్ హీరోగా, ప్రియాంక ఆచర్ కథానాయికగా నటిస్తోంది. ‘కోర్ట్’ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్, తెలుగు సినిమాలో ప్రతిభావంతులైన యంగ్ హీరోల్లో ఒకరిగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. తాజాగా ఈయన ఇప్పుడు మరో భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తన్నారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ లవ్ స్టోరీని తెరెక్కిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్గా మంచి ముహూర్తంలో పూజా కార్యక్రమంతో షురూ అయింది. తొందర్లోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవికత, భావోద్వేగాల నేపథ్యంలో, బలమైన కథనంతో ఆడియన్స్ ముందకు రాబోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.