
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
గతంలో ప్రభుత్వం విడివిడిగా పైరసీ ఛానెళ్ల తొలగించగా.. ఇప్పుడు ఆ ప్రక్రియను సదరు పైరసీ షేర్ చేస్తున్న ప్లాట్‌ఫారమ్‌కే పూర్తి జవాబుదారీ తనాన్ని అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్రం డిమాండ్లు, ఆదేశాలు.. 1) కేవలం ప్రభుత్వం ఫిర్యాదు చేసే వరకు వేచి చూడకుండా, పైరసీ కంటెంట్‌ను స్వయంగా గుర్తించడం, రిపోర్ట్ చేయడం, బ్లాక్ చేయడం సహా అలాంటి పైరసీ కంటెంట్‌ను పూర్తిగా తొలగించడం కోసం టెలిగ్రామ్ తన అంతర్గత సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయాలి.
2) పదేపదే పైరసీకి పాల్పడుతున్న ఛానెళ్లు, గ్రూపులు, బాట్లు, ఖాతాలతో పాటు వాటి నిర్వాహకులు, సంబంధిత సంస్థలపై శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
3) చలనచిత్ర నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, చట్ట అమలు సంస్థలు నేరుగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా టెలిగ్రామ్ కలిగి ఉన్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వివరాలను సమర్పించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
4) ప్లాట్‌ఫారమ్ నుండి పైరసీ కంటెంట్‌ను నిరోధించడానికి ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోబోయే చర్యలపై 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' సమర్పించడానికి టెలిగ్రామ్‌కు 15 రోజుల గడువు ఇచ్చారు.
కేంద్రం హెచ్చరిక.. చట్టపరమైన నిబంధనలు.. "ప్రభుత్వం ఒక్కొక్క పైరసీ ఛానెల్‌ను గుర్తించే వరకు టెలిగ్రామ్ కేవలం వేచి చూడకూడదు" అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐటీ చట్టం, 2000.. ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం ఒక మధ్యవర్తిగా తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత టెలిగ్రామ్‌పై ఉంది. కేవలం ఏదో ఒక ఛానెల్‌ను డిలీట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని కేంద్రం తేల్చిచెప్పింది. (గతంలో ప్రభుత్వం ఇలాంటి 3,000కు పైగా టెలిగ్రామ్ ఛానెళ్లపై చర్యలు తీసుకుంది).
భారతదేశంలో కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదు. కాపీరైట్ చట్టం, 1957.. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 ప్రకారం ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం. పైరసీ కంటెంట్ నిరంతరం అందుబాటులో ఉన్నా, నిబంధనలను పాటించకుండా తప్పించుకోవాలని చూసినా లేదా అసంపూర్ణంగా స్పందించినా.. చట్టపరమైన నిబంధనల ప్రకారం టెలిగ్రామ్‌పై తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ చర్య ఎందుకు ముఖ్యం? భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ, చలనచిత్ర పరిశ్రమ, ప్రసారకర్తలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, నిర్మాతలు, పంపిణీదారుల హక్కులను, వారి శ్రమను, భారీ పెట్టుబడులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన చర్యకు పూనుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.