కొంతమంది షుగర్ ఉన్నవారు, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నవారు కొన్ని పండ్లను తినకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ పండ్లలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో షుగర్ ముప్పును పెంచే ఆ పండ్లు ఏంటో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. భారతి కుమార్ (ఫోర్టిస్ హాస్పిటల్, బెంగళూరు) వివరించారు. అవేంటో చూద్దాం.
ఖర్జూరాల్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తినగానే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే షుగర్ సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.
పుచ్చకాయలో 93శాతం వరకు నీరు ఉంటుంది. కానీ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. కాబట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే కేవలం ఒక కప్పు పుచ్చకాయ తిని సరిపెట్టుకోవాలి.
కొద్దిగా పండిన అరటి పండ్లలో షుగర్ మితంగా ఉంటుంది. కానీ బాగా పండిన అరటి పండ్లలోని స్టార్చ్ చక్కెర లాగా మారుతుంది. దీంతో ఈ పండిన అరటి పండ్లు తింటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి.
మామిడి పండ్లలోనూ చాలా ఎక్కువ చక్కెర శాతం ఉంటుంది. ఓ కప్పు మామిడి ముక్కల్లో దాదాపు 20-30గ్రా షుగర్ ఉంటుంది. కాబట్టి షుగర్ ముప్పు ఉంటే మామిడి పండ్లకు దూరంగా ఉండాలి.
పైనాపిల్ పండ్లలో నేచురల్ షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ముప్పు ఉన్నవారు ఈ పండ్లు తినకూడదు. అలాగే కొంతమంది పైనాపిల్ ముక్కలపై చక్కెర చల్లుకుని తింటారు. ఇది అస్సలు మంచిది కాదు.
గ్రేప్స్ను షుగర్ బాంబ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటిని ఒక్కసారి తింటే అలాగే తింటుంటారు. దీంతో తెలియకుండానే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి.
ద్రాక్షను ఎండబెట్టడం వల్ల ఇందులోని చక్కెర గాఢత మరింత పెరుగుతుంది. ఇలాంటి వాటిని తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఒక్కసారిగా పెరుగుతాయి. కాబట్టి ఎండుద్రాక్షను మితంగా తీసుకోవడం మేలు.
అన్ని పండ్లతో పోలిస్తే చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పండు లిచీ. అందువల్ల ఈ లిచీ పండ్లు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి.