ముల్లంగి రసం, ఉల్లిపాయ రసం కిడ్నీలో రాళ్లను కరిస్తాయని ఎలాంటి శాస్త్రీయ, వైద్యపరమైన ఆధారాలు లేవు. అయితే ఈ రెండు కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. శరీరానికి మంచి హైడ్రేషన్ అంది
ంచినప్పటికీ వాటి రసాలను తాగడం వల్ల కిడ్నీల్లో పేరుకుపోయిన ఖనిజ లవణాలు విచ్ఛిన్నం కావు.
అయితే ముల్లంగి మంచి డైయూరిటిక్. ఇది మూత్ర విసర్జనను పెంచి చిన్న చిన్న రాళ్లను బయటకు నెట్టేయడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అలాగే అనేక అనారోగ్య సమస్యలను దరిచేరనీయకుండా కాపాడుతుందని NLM అధ్యయనం పేర్కొంది.
అయితే ఇలాంటి సమస్యను మీరు గమనించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. లేదంటే కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. నీళ్లు బాగా తాగడం వల్ల మూత్రం పలచబడి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే ఉన్న చిన్న చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లే పోయే అవకాశం ఉంది.
నిమ్మకాయలో సిట్రేట్ ఉంటుంది. ఇది చిన్న చిన్న క్యాల్షియం రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మకాయ రసం, ఒక స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ (ఆప్షనల్) కలిపి ఉదయాన్నే తాగాలి. ఈ ఆలివ్ ఆయిల్ చిన్న చిన్న రాళ్లు మూత్ర నాళం గుండా సులభంగా జారిపోవడానికి లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది.
కొబ్బరి నీళ్లు కిడ్నీ ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి నీళ్లలో సహజంగానే సిట్రేట్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలో ఉండే క్యాల్షియం, ఆక్సలేట్ వంటి లవణాలు ఒకదానితో ఒకటి కలిసి రాళ్లుగా మారకుండా నిరోధిస్తాయి. అలాగే కిడ్నీల్లో ఇప్పటికే పేరుకుపోతున్న చిన్న చిన్న స్పటికాలను మూత్రం నుంచి బయటకు పంపడంలో తోడ్పడుతాయి.
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడానికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం తగ్గడం. కొబ్బరి నీళ్లు ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా బాడీని రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అయితే తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉండే వాళ్లు కొబ్బరి నీళ్లు తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోండి.
బార్లీ వాటర్ కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి తరతరాలుగా ఉపయోగిస్తున్న సంప్రదాయక ఔషధం. బార్లీ వాటర్ శరీరంలో మూత్ర విసర్జనను బాగా పెంచుతుంది. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గి కిడ్నీల్లో పేరుకుపోయిన టాక్సిన్స్, చిన్న చిన్న రాళ్లు సులభంగా కొట్టుకుపోతాయి. మూత్రంలో మంటను తగ్గించి, ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. బార్లీ వాటర్ మూత్రం యొక్క పీహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. మూత్రం మరీ ఎసిడిక్‌గా మారకుండా చూడటం వల్ల కొత్త రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
దీనిని ఎలా ఉపయోగించాలంటే అర కప్పు బార్లీ గింజలు, 4 గింజలు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక పాత్రంలో నీళ్లు పోసి అందులో బార్లీ గింజలను వేసి ఆ నీళ్లు సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టి రోజు రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల ఉపయోగిం ఉంటుంది. రాత్రిపూట తాగకపోవడం మంచిది.
కిడ్నీలో రాళ్లను కరిగించడంలో ఎంతో శక్తివంతమైనది. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లలో ఎక్కువ శాతం క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లే ఉంటాయి. అరటి దూటలో ఉండే ప్రత్యేక గుణాలు ఈ క్యాల్షియం క్రిస్టల్స్‌ను విచ్ఛిన్నం చేసి చిన్న ముక్కలుగా మార్చడానికి సహాయపడతాయి. ఇది శరీరంలో మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. చిన్న చిన్న రాళ్లను మూత్రం ద్వారా బయటకు పంపడంలో తోడ్పడుతుంది. మూత్రంలో మంట, నొప్పి, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సాయపడుతుంది.
ఇవన్నీ 4 -5 ఎంఎం కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లను కరిగించడానికి, బయటకు పంపడానికి బాగా పనిచేస్తాయి. అయితే ఒకవేళ మీకు విపరీతమైన నొప్పి, వాంతులు, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అంతేకానీ నిర్లక్ష్యం చేయవద్దు.
ముఖ్య గమనిక : ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది, పాటించడం, పాటించకపోవడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి