
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Chivas Regal 18 Price In Goa: గోవా అంటే కేవలం బీచ్‌లు, సముద్రపు అందాలు మాత్రమే కాదు.. అక్కడ లభించే వివిధ రకాల బ్రాండ్ల లిక్కర్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తుంది. అయితే, గోవాలో లభించే అత్యంత ఖరీదైన, లగ్జరీ స్కాచ్ విస్కీల ధరలను ఎప్పుడైనా తెలుసుకున్నారు? ఇటీవల గోవాలోని ప్రముఖ వైన్స్ షాపుల్లో ఉన్న టాప్ స్కాచ్ బ్రాండ్ల ధరలకు సంబంధించిన వివరాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. మందుబాబుల ఫేవరెట్ బ్రాండ్ల ధరలు చాలా చీప్‌గా ఉండడం వల్ల ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఏ బ్రాండ్లకు సంబంధించిన లిక్కర్ ఏయే ధరల్లో అందుబాటులో ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.8,500కే షివాస్ రీగల్.. చాలా మంది షివాస్ రీగల్ మందు అంటే ఇష్టపడుతూ ఉంటారు. అత్యంత ఖరీదైన బ్రాండ్‌గా షివాస్ రీగల్ 18 ఇయర్స్ ఓల్డ్‌గా భావించవచ్చు. దీని ధర రూ.8,500తో ప్రారంభమవుతుంది.. స్కాచ్ ప్రియులు ఎంతో ఇష్టపడే ఈ 18 సంవత్సరాల నాటి విస్కీ బాటీల్ రాయల్ లుక్‌తో పాటు దానికి తగ్గట్లుగానే ధరను కలిగి ఉంది. అలాగే షివాస్ 12 ఇయర్స్ ఏజ్డ్ బాటిల్ ఇక్కడ కేవలం రూ.3,400కే అందుబాటులో ఉంది. మరో ప్రముఖ లగ్జరీ బ్రాండ్ అయిన మేకర్స్ మార్క్ (Maker's Mark) బాటిల్ ధర రూ.6,000 నుంచి ప్రారంభమవుతుంది.
టీచర్స్ బ్రాండ్లలో రకాలు.. మద్యం ప్రియులకు ఎంతగానో ఇష్టపడే టీచర్స్ బ్రాండ్లలో ఎన్నో రకాల ధరలతో ఇక్కడ లభిస్తున్నాయి. టీచర్స్ 12 ఇయర్స్ ఏజ్డ్ (గోల్డెన్ థిస్టిల్) ఇక్కడ కేవలం రూ. 2,700 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా టీచర్స్ 50 కేవలం రూ.2,000తో అందుబాటులో ఉండడం విశేషం. టీచర్స్ హైలాండర్ క్రీమ్ రూ.1,420 ధరతో లభిస్తోంది.
స్కాచ్ బ్రాండ్లు ఇవే.. భారీ ధరలు మాత్రమే కాకుండా.. కొంతవరకు బడ్జెట్ ధరల్లో ఉండే అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎంతో పాపులర్ అయిన జేమ్సన్ (Jameson) ఐరిష్ విస్కీ ధర రూ.2,500 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే జిమ్ బీమ్ (Jim Beam) బోర్బన్ విస్కీ బాటిల్ రూ. 1,890కే అందుబాటులో ఉండడం విశేషం. స్కాచ్‌లో కాస్త తక్కువ ధరలో లభించే బ్లాక్ అండ్ వైట్ ధర ఇక్కడ రూ.1,500కే లభిస్తోంది. విస్కీ లవర్స్ ఎక్కువగా కొనుగోలు చేసే విలియం లాసన్స్తో పాటు వ్యాట్ 69 (Vat 69) బ్రాండ్లు కేవలం రూ.1,050 లకే లభించడం విశేషం. ఇక్కడ లాబ్రాడాగ్ 3 ఇయర్స్ ఏజ్డ్ (డబుల్ బ్యారెల్ స్కాచ్) ధర కేవలం రూ. 1,350 నుంచి మాత్రమే లభిస్తోంది. దీంతో పాటు బ్లాక్ డాగ్ ప్రైవేట్ రిజర్వ్ స్టాక్‌ను బట్టి ప్రత్యేక ధరల్లో లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.