
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
AP Land Hereditary Registration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఒక అద్భుతమైన ఊరటను ఇచ్చింది. కుటుంబంలో పెద్దలు మరణించిన తర్వాత, వారి వారసత్వ వ్యవసాయ భూములను తమ పేర్ల మీదకు మార్చుకునేందుకు గతంలో ఉన్న అతి సుదీర్ఘమైన ప్రక్రియకు ఏపీ సర్కార్ స్వస్తి పలికింది. ఇకపై కేవలం రూ.100 స్టాంపు డ్యూటీతో వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే సరికొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త విధానం ప్రకారం ఆస్తి విలువ సుమారు నామినల్ చార్జీలను నిర్ణయించారు. స్టేషన్ చేయించుకోబోయే వారసత్వ భూమి విలువ గనక రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ భూమి విలువ సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటే కేవలం రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై రిజిస్ట్రేషన్ ఫీజులు భారం భారీగా తగ్గనుంది.
ఈ నూతన సంస్కరణలో కేవలం తక్కువ ఖర్చు మాత్రమే కాదు, అంతకు మించిన సాంకేతిక సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం జోడించింది. గతంలో రిజిస్ట్రేషన్ పుట్టిన తర్వాత కూడా రెవిన్యూ రికార్డుల్లో పేరు మార్చడానికి (మ్యుటేషన్ కోసం) రైతులు తహసీల్దారు లేదా విలేజి రెవెన్యూ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు, కాలయాపనతో విసిగిపోయేవారు. ఈ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియకు ఆటోమొటేషన్ విధానాన్ని అనుసంధానం చేసింది.
దీని ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారసుల మధ్య ఆస్తుల విభజన లేదా బదిలీ డాక్యుమెంటరీ అవ్వగా.. ఆ సమాచారం ఆటోమేటిక్‌గా రెవిన్యూ శాఖ సాఫ్ట్వేర్ కు బదిలీ అవుతుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే, వెనువెంటనే రెవిన్యూ రికార్డుల్లో అంటే అడంగల్/1b ఫారాల్లో కొత్త వారసుల పేర్లు అప్డేట్ అయిపోతాయి.
మొత్తంగా తాతలు, తండ్రులు లేదా తల్లులు మరణాంతరం భూహక్కుల మార్పిడి కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగి తిప్పలు తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇది అటు డబ్బును ఇటు అమూల్యమైన కాలాన్ని ఆధారి చేయడమే కాకుండా, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.