యూరిక్ యాసిడ్ రాళ్లు అనేవి ఒక రకమైన కిడ్నీ రాళ్లు. మూత్రంలోని రసాయనాల వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి విసర్జించబడనప్పుడు రాళ్లుగా పేరుకుపోతాయని డాక్టర్ చేతన డి, సీనియర్ కన్సల్టెంట్, రుమటాలజీ, ఆస్టర్...
యూరిక్ యాసిడ్ రాళ్లు అనేవి ఒక రకమైన కిడ్నీ రాళ్లు. మూత్రంలోని రసాయనాల వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి విసర్జించబడనప్పుడు రాళ్లుగా పేరుకుపోతాయని డాక్టర్ చేతన డి, సీనియర్ కన్సల్టెంట్, రుమటాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు తెలిపారు.
పుష్కలంగా నీరు తాగడం వల్ల ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల అదనపు యూరిక్ యాసిడ్ తొలగుతుంది. యూరిక్ యాసిడ్ రాళ్లు తగ్గుతాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ యూరిక్ స్పటికాలను కరిగిస్తుంది.
నిమ్మ, నారింజ, ఉసిరి వంటి వంటి పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థిరంగా ఉంటుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
చెర్రీస్ తినడం లేదా చెర్రీ జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్పటికాలు కరుగుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
రోజులో సరిపడా నీరు తాగకపోవడం వల్ల కూడా కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కిడ్నీలో యూరిక్ యాసిడ్ రాళ్లు పేరుకుపోయే ప్రమాదం ఉంది.
రెడ్‌మీట్ ఎక్కువగా తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ స్పటికాలు పెరిగే అవకాశం ఉంది.
అధిక బరువు వల్ల అనేక సమస్యలు వస్తాయి. అధిక బరువు, మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల యూరిక్ యాసిడ్ స్పటికాలు పేరుకుపోతాయి.