పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. పసుపు టీ తాగడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
అనేక రకాల సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. దీనికోసం నీళ్లలో కొద్దిగా పసుపు వేసి మరిగించండి. పసుపులోని పోషకాలు బాగా అందాలంటే కొద్దిగా మిరియాల పొడి కూడా కలపండి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అనేక లాభాలు కలుగుతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఉదయం పూట కీళ్లు బిగుతుగా మారడాన్ని నివారిస్తాయి.
పసుపులోని పోషకాలు కాలేయంలో బైల్ రసం ఉత్పత్తిని పెంచి తిన్న ఆహారంలోని కొవ్వులను బ్రేక్ చేస్తాయి. దీంతో తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో పసుపు టీ తాగడం ద్వారా మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. దీంతో కేలరీల ఖర్చు పెరిగి బరువు అదుపులో ఉంటుంది.
పసుపులోని పోషకాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగు చేసి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. దీంతో డయాబెటిస్ ముప్పు రాకుండా కాపాడుకోవచ్చు.
ప్రతిరోజూ పసుపు టీ తాగితే రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ధమనుల్లో అడ్డంకులు కరిగిపోతాయి. దీంతో గుండెపోటు వంటి రిస్క్ ఉండదు.
పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుకుగా ఉంచుతాయి. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అందుకే పిల్లలకు కూడా ఈ పసుపు టీ తాగించడం మంచిది.
పసుపు నీళ్లు తాగితే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. దీంతో శరీరం నుంచి విష పదార్థాలు బయటకు పోతాయి. తద్వారా లివర్ హెల్త్ కూడా బాగుంటుంది.