భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన ఓ మహిళ.. అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ఉరేసి చంపింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి బాత్రూమ్లోనే శవాన్ని గొయ్యితీసి పూడ్చిపెట్టి, ప్లాసింగ్ చేసి,...
భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన ఓ మహిళ.. అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ఉరేసి చంపింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి బాత్రూమ్లోనే శవాన్ని గొయ్యితీసి పూడ్చిపెట్టి, ప్లాసింగ్ చేసి, టైల్స్ అతికించింది. తర్వాత తన భర్త కనిపించకుండా పోయాడని కట్టుకథ అల్లింది. దిగ్భ్రాంతికర ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగుచూసింది. ఏ పనిచేయకుండా మద్యానికిపై బానిసై నిత్యం వేధిస్తున్నాడని ఆమె ఈ దారుణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని దొహతోరా ప్రాంతంలో సురేంద్ర శర్మ (44), తన భార్య రుబీ శర్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. మే 26న ఆయన భార్య రుబీ శర్మ.. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి అతడి ఆచూకీ కోసం గాలించారు. సాధారణ పోలీసు వెరిఫికేషన్ సమయంలో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో భార్య ఘాతకం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. సురేంద్ర శర్మకు రుబీతో 16 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే, హత్య జరిగిన రోజు తన ఇద్దరు కుమార్తెను సురేంద్ర అన్నయ్య ఇంటికి పంపింది. ఆ రోజు రాత్రి భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. సురేంద్ర స్పృహ కోల్పోయిన తర్వా అతడిని గొంతు నులిమి చంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరుసటి రోజు ఉదయం నేరాన్ని దాచిపెట్టేందుకు బాత్రూమ్లో ఒక గొయ్యి తవ్వి, మృతదేహాన్ని పూడ్చిపెట్టి, దానిపై సిమెంట్‌లో ఫ్లోరింగ్ వేసి, టైల్స్ అంటించినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఆ తర్వాత 45 రోజుల పాటు రూబీ తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని బంధువులకు, ఇరుగుపొరుగు వారికి చెబుతూ, ఎవరైనా అతడి గురించి అడిగినప్పుడల్లా ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉండేది. సురేంద్రకు సంబంధించిన పాత కేసులో సాధారణ తనిఖీ కోసం పోలీసు బృందం ఆ ఇంటికి వెళ్లినప్పుడు ఈ హత్య వెలుగులోకి వచ్చింది.రూబీ ఆందోళనగా ప్రవర్తించడం, తన బావను ఇంటికి పిలవడం అధికారులు గమనించారు. ఇప్పటికే తన సోదరుడి అదృశ్యం, రూబీ ప్రవర్తనపై అనుమానంతో ఉన్న అతడు. తన ఆందోళనలను పోలీసులతో పంచుకున్నారు. సుదీర్ఘ విచారణలో రూబీ హత్యను అంగీకరించి, మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో వెల్లడించినట్లు సమాచారం. అనంతరం పోలీసులు బాత్రూమ్ నేలను పగలగొట్టి, సురేంద్ర మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు.మే 26న సురేంద్ర అదృశ్యంపై ఫిర్యాదు నమోదైందని ఆగ్రాలోని హరిపర్వత్ సర్కిల్ ఏసీపీ అమీషా తెలిపారు. విచారణలో, భార్యే అతడిని హత్య చేసి, మృతదేహాన్ని బాత్రూమ్ నేల కింద పాతిపెట్టి, సిమెంట్‌తో కప్పివేసినట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.ఆగ్రా డిప్యూటీ కమిషనర్ సయ్యద్ అలీ అబ్బాస్ మాట్లాడుతూ... ఈ నేరాన్ని రుబీ ఒక్కరే చేశారా? అనేది విచారిస్తున్నట్టు తెలిపారు. శవాన్ని గొయ్యి తీసి పాతిపెట్టడం ఒక్కరి వళ్ల అసాధ్యమని, ఆమెకు ఎవరైనా సహకరించారా? అనేది దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.