
టాలీవుడ్లో వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన లెజెండరీ నిర్మాణ సంస్థ ‘ఈవీవీ సినిమా’ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దివంగత ప్రముఖ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్, ‘ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థతో చేతులు కలిపి ఒక విలక్షణమైన చిత్రాన్ని పట్టాలెక్కించింది. ఈవీవీ సినిమా బ్యానర్లో వస్తున్న ప్రొడక్షన్ నెం.10, అలాగే ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ఈవీవీ సినిమా బ్యానర్‌పై ఈవీవీ తనయుడు, నటుడు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా మారారు. ఆయన మరో నిర్మాత ఎన్.వి.కృష్ణారెడ్డితో కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తిగా ఒక నిజ జీవిత కథ ఆధారంగా, మనసుకు హత్తుకునే తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన ఒక ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ‘కోర్ట్’ సినిమాతో నటుడిగా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని, టాలీవుడ్లో ప్రామిసింగ్ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రియాంక ఆచర్ నటిస్తోంది. ఈ కొత్త తరం ప్రేమకథను అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా డైరెక్ట్ చేయనున్నారు. నిజ జీవితంలో ఉండే ఎమోషన్స్, మానవ సంబంధాల చుట్టూ ఈ కథను వారు అల్లినట్లు తెలుస్తోంది. llywood News