
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Bhadra Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో ఒక ముఖ్యమైన గ్రహాల మార్పు జరగబోతోంది. ఈ మార్పు కారణంగా అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన భద్ర రాజయోగం ఏర్పడబోతోంది.. జూలై 7వ తేదీ నుంచి బుధ గ్రహం ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడడం కారణంగా ఈ రాజయోగం మొదలవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని బుద్ధి, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్‌తో పాటు ఆలోచనలకు కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు జూన్ చివరలోనే మిథునరాశిలోకి ప్రవేశించగా.. జూలై 7 నుంచి దీని ప్రభావం మరింత బలంగా మారబోతోంది.. బుధుడు తన సొంత రాశిలో లేదా ఉచ్ఛ రాశిలో మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం కారణంగా కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితి, నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై సానుకూల ప్రభావం పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది 3 రాశుల వారు ఈ యోగం వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఆ అదృష్టాన్ని పొందే రాశుల వారు వీరే.. కర్కాటక రాశి (Cancer) భద్ర రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఉద్యోగ, ఉపాధి రంగాలలో అద్భుతమైన సానుకూల మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు నిర్ణయాత్మక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల కార్యాలయంలో పైఅధికారుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కెరీర్లో కొత్త లాభదాయకమైన అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది..
ధనుస్సు రాశి (Sagittarius) ధనుస్సు రాశి వారికి ఈ సమయం వ్యాపార పరంగా ఎంతో లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Businesses) చేసే వారికి భారీ విజయాలు కలిగే అవకాశాలు కూడా కనిసిస్తున్నాయి. మార్కెట్లో ధనుస్సు రాశివారికి సంబంధించిన పరపతి విపరీతంగా పెరుగుతుంది. లాభదాయకమైన ఒప్పందాలు లేదా పెద్ద ప్రాజెక్టులు మీ ముందుకు వచ్చే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణకు ఇది అత్యంత అనుకూలంగా మారుతుంది.
మీన రాశి (Pisces) మీన రాశి వారికి ఈ భద్ర రాజయోగం వల్ల కుటుంబ, ఆస్తి పరమైన విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి వివాదాలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వాహనాలు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతి లేదా కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి..
ఈ రంగాల వారికి గోల్డెన్ పీరియడ్! జ్యోతిష్య నిపుణుల అందించిన సమాచారం ప్రకారం.. ఈ రాజయోగం వల్ల సమాజంలో వ్యక్తుల ఆలోచనా విధానంతో పాటు జ్ఞానం విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, రచనా రంగం, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌తో పాటు క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలను అందిస్తాయి.
(నోట్: ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య నమ్మకాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తీసుకు రాసింది మాత్రమే. వ్యక్తిగత జాతక చక్రాలతో పాటు గ్రహాల స్థితులను బట్టి రాశులవారి జీవితాల్లో ఫలితాలు, మార్పులు ఉంటాయి.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.